Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పచ్చి బొప్పాయిలో ఎన్ని పోషకాలో!

పండిన బొప్పాయిలను తినడానికే చాలా మంది ఇష్టపడతారు. అయితే, పోషక పదార్ధాల రీత్యా పచ్చి బొప్పాయి ఎంతో మేలంటున్నారు నిపుణులు. ఇందులోని పోషకాలు, ఎంజైములు జీర్ణ వ్యవస్థను మెరుగుపర్చుతాయి. ముఖంపై మొటిమలు, మచ్చలు, పలు రకాల చర్మ వ్యాధులను నయం చేసే శక్తి పచ్చి బొప్పాయికి ఉంది. చర్మానికి చెందిన మృత కణాలను తొలగించి, కొత్త కాంతినిస్తుంది. పచ్చి బొప్పాయితో అమీబియాసిస్, నులిపురుగుల బెడద తప్పుతుంది. తద్వారా, అజీర్ణం, పుల్లని తేన్పులు వంటి బాధలు నెమ్మదిస్తాయి. రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్టు చూడడం ద్వారా రక్తపోటు స్థాయిని సరైన స్థితిలో ఉంచుతుందీ పచ్చి బొప్పాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ ఏ ఉంటాయి. ప్రతి 100 గ్రాముల పచ్చి బొప్పాయిలో 39 కెలోరీలు మాత్రమే ఉంటాయి. దీన్ని తినడం ద్వారా కొవ్వు చేరే అవకాశమే లేదు. దీన్ని సలాడ్ల రూపంలోనూ, జ్యూస్ గానూ తీసుకోవచ్చు. ఇక, బొప్పాయి ఆకులను చింతపండు, ఉప్పుతో కలిపి తీసుకుంటే మహిళల్లో బహిష్టు కారక నొప్పులు తగ్గుముఖం పడతాయి.

More Telugu News